టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం కానున్న సీఎం జగన్..!

Published on Aug 15, 2021 1:00 am IST

క‌రోనా సెకండ్‌ వేవ్ తగ్గుముఖం ప‌ట్ట‌డంతో సినిమా థియేట‌ర్లు తెరిచేందుకు ఎగ్జిబిట‌ర్లు సిద్ధ‌మైన సంగతి తెలిసిందే. అయితే ఏపీలో టికెట్ల ధరలు ప్రధాన సమస్యగా మారడం, తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్‌ పెద్దలు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో నేడు ఏపీ మంత్రి పేర్ని నానిని మెగాస్టార్ చిరంజీవి సినీపెద్ద‌ల‌తో వెళ్లి కలిశారు. సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేతూ, సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్ కోరారు.

సినీ పెద్దలతో సమావేశం అయ్యేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఆగస్టు చివరి వారంలో ఈ సమావేశం జరగనున్నట్టు సమాచారం. అయుతే భేటీలో ప్ర‌స్తుతం ఉన్న థియేట‌ర్ల స‌మ‌స్య గురించి, టికెట్ల ధరలు, ఈ రంగంపై ఆధార‌ప‌డి జీవిస్తున్న కార్మికుల బ‌తుకు తెరువు స‌హా, పంపిణీ వ‌ర్గాల వేతనాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :