ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహాదారుగా ఆలీ నియామకం

ఏపీ ఎలక్ట్రానికి మీడియా సలహాదారుగా ఆలీ నియామకం

Published on Oct 28, 2022 12:14 AM IST

కమెడియన్ గా టాలీవుడ్ లో ఎన్నో వందల సినిమాల్లో నటించి ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకంగా క్రేజ్ అందుకున్న నటుడు ఆలీ. ఇక ప్రస్తుతం ఆయన ఆలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే సినిమా ద్వారా నిర్మాతగా కూడా మారారు. రేపు ఈ మూవీ ప్రముఖ ఓటిటి మాధ్యమం ఆహా ద్వారా ఆడియన్స్ ముందుకి రానుంది.

అయితే విషయం ఏమిటంటే, ఇటీవల ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరిన ఆలీ, అప్పటి నుండి తనవంతుగా పార్టీకి సేవలు అందిస్తూ వస్తున్నారు. కాగా నేడు ఆలీని ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఏపీ ప్రభుత్వం అధికారికంగా గవర్నమెంట్ జీవో జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా తనకు ఈ అవకాశం అందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఆలీ.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు