మళ్లీ హీరోగా రాబోతున్న సీనియర్ కమెడియన్ !

Published on May 14, 2019 6:35 pm IST

ఆలీ హీరోగా గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా ‘పండుగాడి ఫోటోస్టూడియో’. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు దిలీప్ రాజా మాట్లాడుతూ ‘స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు ఒకే చేసిన కధ ఇది. “వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది” అనేది ఈ చిత్ర క్యాప్షన్.

ఈ చిత్రంలో హీరోకు 40 ఇయర్స్ వచ్చే వరకు పెళ్లి కాదు. పూర్తి హాస్య భరిత చిత్రమిది.1150 చిత్రాల్లో నటించిన ఆలీ గారు ఈ చిత్రం లో హీరోగా అద్భుతమైన నటనని ప్రదర్శించారు. హీరోయిన్ గా రిషితను పరిచయం చేస్తున్నాము. కుటుంబ సభ్యులతో కడుపుబ్బా నవ్వుకునేలా ‘పండుగ ఫోటో స్టూడియో’ సినిమా రూపొందించామన్నారు . ఈ సినిమాలో వినోద్ కుమార్, బాబు మోహన్, సుధ, జీవ తదితరులు నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More