హాస్యనటుడి సాయానికి నెటిజన్లు ఫిదా

హాస్యనటుడి సాయానికి నెటిజన్లు ఫిదా

Published on Mar 25, 2024 12:38 PM IST

Brahmanandam

తెలుగు చిత్రసీమలో ఈ తరానికి హాస్యాన్ని పరిచయం చేసిన ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తిరుపతిలో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి వెళ్లిన హాస్యనటుడు బ్రహ్మానందం.. అక్కడ మరణించిన ఓ కళాకారుడి కుటుంబానికి రూ.2.17 లక్షల ఆర్థిక సహాయం చేశారు. స్వయంగా ఆయనే ఆ కుటుంబానికి ఆ సాయాన్ని అందించారు.

అనంతరం బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘కళాకారులు బాహ్య రూపం కంటే అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యం ఇస్తారు. గడ్డి పువ్వులో అందాన్ని చూస్తేనే ఆధ్యాత్మిక ఆంతర్యం అర్థమవుతుంది’ అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఐతే, బ్రహ్మానందం చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్రహ్మానందం గురించి ఇన్నాళ్లు తప్పుగా విన్నామని.. కానీ ఈ చర్యతో ఆయన తాను ఏమిటో చాటి చెప్పారని కామెంట్స్ పెడుతున్నారు.

తాజా వార్తలు