టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు 170 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడిక్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే సంవత్సరానికి ఒకసారి జరిగే కామిక్ కార్న్-2014లో ‘బాహుబలి’ కూడా ఒక భాగమైంది. ఈ కామిక్ కార్న్ లో బాహుబలిలో ప్రభాస్, అనుష్క, మరియు రానాల ఫుల్ గెటప్స్ ఫోటోల స్టాండీలను ఉంచడమే కాకుండా బాహుబలి సినిమాలో రానా ఉపయోగించిన కిరీటాన్ని ప్రదర్శనకి ఉంచారు.
కామిక్ కార్న్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ కిరీటంతో ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తే, కొంతమంది మహిళలు బాహుబలిలో అనుష్క చేసిన దేవసేన పాత్ర కాస్ట్యూమ్ లో సందడి చేసారు. నేటితో ముగియనున్న కామిక్ కార్న్ లో బాహుబలికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది కాకుండా ఈ నెలలోనే బాహుబలికి సంబందించిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. రెండు పార్ట్స్ గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని 2015 ఏప్రిల్ లో, రెండవ పార్ట్ ని 2016 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.


