కన్ఫర్మ్..”అవతార్ 2″ అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ పై అధికారిక డేట్.!

Published on Apr 29, 2022 8:00 am IST

గత రెండు రోజులు నుంచి కూడా పాన్ వరల్డ్ స్థాయిలో ఒక రేంజ్ లో మారు మొగుతున్న సినిమా పేరు “అవతార్”. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కెమరూన్ మైండ్ లో నుంచి పుట్టిన ఈ బిగ్గెస్ట్ విజువల్ వండర్ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఎన్నో వండర్స్ ని నమోదు చేసింది. ఇక దీనికి రెండో సినిమా అనౌన్స్ చెయ్యడం మళ్లీ చాలా కాలం తర్వాత టీజర్ స్పెషల్ షో కి తీసుకు రావడంతోనే కనీ వినీ ఎరుగని హైప్ కేవలం ఈ రెండు రోజుల్లో పెరిగిపోయింది.

ఇక ఈ సినిమాకి “అవతార్ ది వే ఆఫ్ వాటర్” అనే టైటిల్ ని కన్ఫర్మ్ చెయ్యగా ప్రపంచ వ్యాప్త ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ పై ఉన్న రూమర్స్ ని చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నారా? అయితే అది ఈ మే 6న రిలీజ్ కాబోతున్న డాక్టర్ స్ట్రేంజ్ మ్యాడ్ నెస్ ఆఫ్ మల్టీ వర్స్ తో రాబోతుంది అని అవతార్ అఫిషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. దీనితో ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ కి ఒక డేట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :