రామ్ చరణ్ సినిమాపై టోటల్ కన్ఫ్యూజన్

Published on Jan 14, 2021 8:00 pm IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి సినిమా వచ్చి రెండేళ్లు గడిచిపోతోంది. ప్రస్తుతం ఆయన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి సినిమా కాబట్టి ఆ మాత్రం టైమ్ తీసుకోవడం కామన్. పైగా లాక్ డౌన్ వలన ఏడు నెలలు వృధా పోయాయి. అందుకే చరణ్ అభిమానులు ఓపికగానే ఉన్నారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మాత్రం ఏడాదికి రెండు సినిమాలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

ఈ 2021లో ‘ఆర్ఆర్ఆర్’ పూర్తవుతుంది. కాబట్టి కొత్త సినిమాను ఈ సంవత్సరంలోనే మొదలుపెట్టాలి. అయితే ఇప్పటివరకు చరణ్ తర్వాతి సినిమా ఎవరితో అనేది బయటకు రాలేదు. ఇంతకీ చరణ్ అయినా నిర్ణయించుకున్నాడా లేదా అనేది కూడ అనుమానమే. అయితే ఇండస్ట్రీ వర్గాలు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చరణ్ ఒక సినిమాను చేసే ఆలోచనలో ఉన్నారని
అంటున్నారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడ సినిమా ఉండే అవకాశం ఉందట. త్రివిక్రమ్, చెర్రీ కలయికలో సినిమా ఆలోచన ఇప్పటిది కాదు. చాలారోజుల నుండే ఉంది. ఇండస్ట్రీలోని దాదాపు అందరు స్టార్ హీరోలతో వర్క్ చేసిన త్రివిక్రమ్ చెర్రీతో మాత్రమే చేయాల్సి ఉంది. త్వరలో వీరి ప్రాజెక్ట్ ప్రకటించబడే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఈ గందరగోళానికి చరణ్ ఎప్పుడు చెక్ పెడతాడో చూడాలి.

సంబంధిత సమాచారం :

More