“లవ్ స్టోరీ” విడుదల పై కొనసాగుతున్న కన్ఫ్యూజన్!

Published on Aug 14, 2021 12:00 am IST

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లవ్ స్టోరీ. రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫీల్ గుడ్ సినిమాలని ప్రేక్షకుల కి అందించిన శేఖర్ కమ్ముల మరొకసారి ప్రేక్షకులని మాయ చేసేందుకు సిద్దం అవుతున్నారు.

ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం విడుదల పై ఇంకా క్లారిటీ రాక పోవడం తో అభిమానులు మేకర్స్ పై కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం ను వచ్చే నెల వినాయక చవితి సందర్భంగా విడుదల చేసే అవకాశం ఉందని సినీ పరిశ్రమ లో టాక్ వినబడుతుంది. ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉండటం తో మేకర్స్ సైతం త్వరలో దీని పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. పవన్ సి హెచ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, విజయ్ సి. కుమార్ సినిమటోగ్రాఫి అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :