కేరళలో కూలీ ప్రభంజనం.. అడ్వాన్స్‌తోనే హడలెత్తిస్తున్నాడుగా..!

కేరళలో కూలీ ప్రభంజనం.. అడ్వాన్స్‌తోనే హడలెత్తిస్తున్నాడుగా..!

Published on Aug 8, 2025 3:08 PM IST

coolie

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘కూలీ’ మరో వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేసేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. ఇక ఈ సినిమా రిలీజ్‌కు ముందే సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకుంటోంది.

ఈ సినిమాను చూసేందుకు అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో కేరళలో కూలీ చిత్రం కోసం అక్కడి అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో కూలీ కేరళలో ఏకంగా రూ.2 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.

భారీ క్యాస్టింగ్‌తో లోకేష్ కనగరాజ్ ఎలాంటి యాక్షన్ చేయిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు