హైదరాబాద్ మెట్రోపై కూలీ ఆదిపత్యం.. మామూలు ప్రమోషన్స్ కాదు ఇవి..!

హైదరాబాద్ మెట్రోపై కూలీ ఆదిపత్యం.. మామూలు ప్రమోషన్స్ కాదు ఇవి..!

Published on Aug 7, 2025 1:04 AM IST

Coolie 5

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ ‘కూలీ’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా

చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించడంతో అంచనాలు పీక్స్‌లో నెలకొన్నాయి. ఇక ఈ

సినిమాను మేకర్స్ వేరే లెవెల్‌లో ప్రమోట్ చేస్తూ దూసుకెళ్తున్నారు. కేవలం తమిళ్‌లోనే కాకుండా ఇతర భాషల్లోనూ గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేయడంతో కూలీ ఆయా బాషల్లో సాలిడ్ ప్రమోషన్స్ చేస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులో ప్రమోట్ చేసేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ హైదరాబాద్‌కు చేరుకున్నాడు. రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్ట్‌లో తలైవా చాలా ఎనర్జీతో కనిపించాడు. ఇక ఈ చిత్ర పోస్టర్స్ హైదరాబాద్ మెట్రో రైలుపై అతికించి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న తీరు ఆకట్టుకుంటుంది. దీంతో మేకర్స్ ఈ సినిమాపై ఏ రేంజ్‌లో కాన్ఫిడెంట్‌గా ఉన్నారో అర్థమవుతుంది.

మొత్తానికి ఈ సినిమాకు తెలుగులోనూ గ్రాండ్ స్కేల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్ చేస్తున్న కృషి అభినందనీయం. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ తదితరులు ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ వారు అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు