డే 2 నైజాం వసూళ్లు: ‘కూలీ’ షాక్.. వెనుకబడ్డ ‘వార్ 2’

డే 2 నైజాం వసూళ్లు: ‘కూలీ’ షాక్.. వెనుకబడ్డ ‘వార్ 2’

Published on Aug 16, 2025 12:00 PM IST

war2-coolie

లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన సాలిడ్ చిత్రాల్లో క్రేజీ మల్టీస్టారర్ చిత్రాలు కూలీ అలాగే వార్ 2 ల కోసం తెలిసిందే. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమాల పట్ల మన తెలుగు ఆడియెన్స్ కూడా బాగా ఎదురు చూసారు. ఇలా మొదటి రోజు మన తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ఈ చిత్రానికి అందుకోగా రెండు సినిమాలు నడుమ గట్టి పోటీ నడుస్తుంది.

ఇలా మొదటి రోజు నైజాంలో రెండు సినిమాల్లో వార్ 2 కేవలం 10 లక్షల లీడ్ తో ఉంటే రెండో రోజు మాత్రం కూలీ షాకిచ్చింది. డే 2 కి గాను వార్ 2 చిత్రానికి 3 కోట్ల షేర్ వస్తే కూలీ చిత్రానికి మాత్రం 3.7 కోట్ల షేర్ ని అందుకున్నట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో రెండో రోజు మాత్రం వార్ 2 ని దాటి కూలీ సినిమా డామినేట్ చేయడం ఒకింత ఆశ్చర్యకరమే అని చెప్పాలి. ఇక మూడో రోజు వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు