ఈ సమయంలో మద్యం అవసరం అంటున్న సీనియర్ హీరో

Published on Mar 28, 2020 9:00 pm IST

కరోనా వైరస్ కారణంగా కర్ఫ్యూ కొనసాగుతున్న తరుణంలో మనిషి ఇంటికే పరిమితం అవుతున్నాడు. చుట్టూ భయం,నిరాశలో ఉంటాడు. ఇలాంటి సమయంలో పోలీసులు, వైద్యులు, పౌరులకి మద్యం అవసరం. బ్లాక్‌లో అయిన మద్యం అమ్మే ఏర్పాట్లు చేయండని రిషి కపూర్ సలహా ఇచ్చారు. ప్రభుత్వాలకు సైతం ఆదాయం కొరకు మద్యం అమ్మకాలు అవసరమే అని చెప్పిన రిషి కపూర్ సాయంత్రం వేళలలో కొంత సమయం మద్యం అమ్మకాలు కొనసాగించాలని కోరాడు.

కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో మనుషులు ఇళ్లకే పరిమితం కావాలి, నిత్యావసరాలకు తప్ప బయటకు రాకూడని ఆంక్షలు విధిస్తున్న తరుణంలో సీనియర్ హీరో రిషి కపూర్ డిమాండ్ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన అభిప్రాయాన్ని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More