యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ హీరోగా మానస వారణాసి హీరోయిన్ గా దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ డ్రామా థియేటర్స్ లో చూసిన అందరి నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఈ సినిమాకి థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ డెఫినెట్ గా దీనిలో ఉన్న కంటెంట్ కి ఇంకా ఎక్కువ రావాలని చాలా మంది ఆశించారు.
ఇది ఫైనల్ గా ఓటిటి లోకి వచ్చాక తీరుతుంది అని చెప్పవచ్చు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా వచ్చాక తెలుగు, తమిళ ఆడియెన్స్ నుంచి కూడా మంచి స్పందన అందిస్తున్నారు. ఒక బ్యూటిఫుల్ సినిమాని తాము చూశామని సోషల్ మీడియాలో చెబుతున్నారు. దీనితో కపుల్ ఫ్రెండ్లీ చిత్రం మరింత సక్సెస్ ని అందుకుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ఈ సినిమాకి ఆదిత్య రవీంద్రన్ నిర్మాణం వహించగా యూవీ కాన్సెప్ట్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే యూవీ క్రియేషన్స్ సమర్పణలో రిలీజ్ కి వచ్చింది.
