పోకిరి తరహా భారీ ట్విస్ట్ ఉంటుందట

Published on Jul 11, 2020 4:36 pm IST

మహేష్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా ఉన్న పోకిరి ఆయనకు చాలా స్పెషల్. పోకిరి సినిమాలో మహేష్ ఆటిట్యూడ్ మరియు హీరోయిజం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ ఆ సినిమాను వీర లెవల్లో ఎంజాయ్ చేశారు. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ అనేది తెలుగు సినిమాలలో బెస్ట్ స్క్రీన్ ప్లేగా ఉంది. కాగా మహేష్ నెక్స్ట్ మూవీ సర్కారు వారి పాట మూవీలో కూడా ఈ తరహా అదిరిపోయే ట్విస్ట్ దర్శకుడు పరుశురాం ప్లాన్ చేస్తున్నాడట. సర్కారు పాట మూవీలో కూడా మహేష్ పాత్రలో ఓ భారీ ట్విస్ట్ దాగుంటుందన్న వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది.

వింటుంటేనే వావ్ అనిపిస్తున్న ఈ న్యూస్ లో మరి నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే. ఈ మూవీ సెప్టెంబర్ నుండి షూటింగ్ జరుపుకోనుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంగీతం థమన్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ మరియు జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :

More