ఎన్టీఆర్ హీరోయిజం కెజిఎఫ్ రాఖీ భాయ్ కి మించి.

Published on Jul 4, 2020 7:36 am IST

ఎన్టీఆర్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ లో కొమరం భీమ్ గా నటిస్తున్న ఆయన తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో ప్రకటించారు. ఈమూవీ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా, కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ రోల్ పై ఆసక్తి కర వార్తలు ప్రచారం అవుతున్నాయి.

కాగా ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఈ మూవీపై నిర్మాతలు, దర్శకుడు హింట్ ఇచ్చారు. ఇక ఈ మూవీలో ఎన్టీఆర్ రోల్ ఊరమాస్ గా ఉంటుందట. కెజిఎఫ్ లో రాఖీ భాయ్ గా యశ్ ని ఓ రేంజ్ లో చూపించిన ప్రశాంత్ నీల్ అంతకు మించి ఎన్టీఆర్ పాత్ర ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత సమాచారం :

More