చరణ్, లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్!

చరణ్, లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ పై క్రేజీ బజ్!

Published on Mar 21, 2025 8:01 AM IST

Ram charan lokesh kanaka ra

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇపుడు బుచ్చిబాబు సానా అలాగే సుకుమార్ ల కలయికలో భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన తోటి ఉన్న స్టార్స్ లా మరిన్ని సినిమాలు తన లైనప్ లో లేవు. అఫీషియల్ గా అయితే ఈ రెండే కనిపిస్తుండగా నెక్స్ట్ సినిమాలు ఏంటి ఎవరితో అనేవి ఇంకా ఖరారు కావాల్సి ఉంది. అయితే ఈ చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేయనున్న సినిమా కూడా ఒకటని కొన్నాళ్ల నుంచి రూమర్స్ ఉన్నాయి.

మరి ఈ క్రేజీ కాంబినేషన్ పై ఇపుడు కొత్త బజ్ వినిపిస్తుంది. దీనితో ఈ చిత్రంని కన్నడ నిర్మాణ సంస్థ కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు టేకప్ చేయనున్నట్టుగా టాక్. వీరు ఆల్రెడీ లోకేష్ తో కొన్ని సినిమాలు సైన్ చేసుకోగా అందులో ఒకటి గ్లోబల్ స్టార్ తో కూడా ఉంటుంది అని టాక్. మరి చూడాలి ఈ కలయిక ఎంతవరకు నిజం అవుతుంది అనేది. మరి ఒకవేళ నిజం అయితే మాత్రం మరో లెవెల్లో ఇది ఉండొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు