క్రేజీ బజ్ : ‘ది రాజా సాబ్’ : ముగ్గురు హీరోయిన్స్ తో చిందేయనున్న ప్రభాస్

క్రేజీ బజ్ : ‘ది రాజా సాబ్’ : ముగ్గురు హీరోయిన్స్ తో చిందేయనున్న ప్రభాస్

Published on Apr 30, 2024 3:01 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాల్లో హర్రర్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ది రాజా సాబ్ ఒకటి. ఈ మూవీని మారుతీ తెరకెక్కిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై ప్రతిష్టాత్మకంగా నిర్మితం అవుతున్న ది రాజా సాబ్ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ నుండి త్వరలో ఒక మంచి మాస్ నెంబర్ ని షూట్ చేయనున్నారట. ఈ మాస్ సాంగ్ లో హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ ముగ్గురితో కలిసి ప్రభాస్ చిందేయనున్నారట. ఇక ఈ మాస్ నెంబర్ లో ప్రభాస్ డ్యాన్స్ అదిరిపోనుండగా ఈ సాంగ్ మూవీకి హైలైట్ కానుందని టాక్. మొత్తంగా ఈ మూవీని వీలైనంత త్వరలో పూర్తి చేసి ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు