సమీక్ష : క్రేజీ క్రేజీ ఫీలింగ్ – అంత క్రేజీగా లేదు !

సమీక్ష : క్రేజీ క్రేజీ ఫీలింగ్ – అంత క్రేజీగా లేదు !

Published on Mar 1, 2019 6:38 PM IST
Crazy Crazy Feeling movie review

విడుదల తేదీ : మార్చి 01, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : విష్వoత్, పల్లక్ లల్వాని, వెన్నెల కిశోర్, ఫిదా ఫేమ్ శరణ్య , సుమన్ , పోసాని తదితరులు

దర్శకత్వం : సంజయ్ కార్తీక్

నిర్మాత : మధు

సంగీతం : భీమ్స్ సిసిరోలియో

స్క్రీన్ ప్లే : సంజయ్ కార్తీక్

సినిమాటోగ్రఫర్ : సుభాష్ దొంతి

ఎడిటర్ : మేనగ శ్రీను

సంజయ్ కార్తీక్ దర్శకత్వంలో విజ్ఞత ఫిలిమ్స్ పతాకం పై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’. విశ్వంత్, పల్లక్ లల్వాని జంటగా నటించారు. కాగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ :

అభి (విశ్వనాథ్) స్పందన (పల్లక్ లాల్వానీ)ను చూశాక ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తరువాత జరిగే కొన్ని సంఘటనల అనంతరం అభి ప్రేమను స్పందన యాక్సెప్ట్ చేస్తోంది. ఇక వాళ్ళ ప్రేమ విషయంలో ఎలాంటి అడ్డంకులు లేవు అనుకుంటున్న సమయంలో.. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వచ్చే ఓ ఒప్పందం కారణంగా అభి స్పందన విడిపోతారు. అసలు వాళ్ళు విడిపోవడానికి గల కారణం ఏమిటి ? మళ్ళీ వాళ్లిద్దరూ కలుస్తారా ? కలిస్తే ఎలా కలుస్తారు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

తన మొట్టమొదటి సినిమా కేరింతతో పోలిస్తే.. నటనలో హీరో విశ్వంత్ ఎంతో మెరుగయ్యారు. ముఖ్యంగా తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి అంశంలో ఎంతో అనుభవం ఉన్న నటుడిలా చాలా బాగా నటించాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా పల్లక్ లాల్వానీ చాలా అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

ఇక సినిమాకి ప్రధాన బలం అంటే కమేడియన్ వెన్నెల కిషోరే. తన కామెడీ టైమింగ్ తో అలరిస్తూ.. అక్కడక్కడా బాగా నవ్విస్తాడు. అలాగే సినిమాలో అతని ఫన్నీ ట్రాక్ కూడా బాగుంది. ఫిదా ఫేమ్ సంజన, మరియు హీరోయిన్ సిస్టర్ గా నటించిన నటి.. అదేవిధంగా హీరోకి సిస్టర్ గా నటించిన నటి కూడా చాలా బాగా నటించారు.

సీనియర్ నటుడు సుమన్ తనకు ఇచ్చిన ఓ గౌరవనీయమైన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని డైలాగ్ లి పేలాయి. ఫన్నీ సంభాషణలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు లవ్ స్టోరీకి సంబంధించి మంచి పాయింట్ తీసుకున్నాడు గానీ, కథా కథనాన్ని మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా రాసుకోలేదు. హీరో హీరోయిన్ల మధ్యన వచ్చే ప్రేమ మరియు సంఘర్షణ తాలూకు సన్నివేశాలు కూడా పూర్తిగా ఆకట్టుకున్నే విధంగా ఉండవు.

పైగా సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలు కూడా చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు. అయితే సినిమా అక్కడక్కడ సరదాగా సాగిన, ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది.

ఫస్ట్ హాఫ్ లో కామెడీ సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కాకపోతే అవి పెద్దగా వర్కౌట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

దర్శకుడు సినిమాను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా మలచలేకపోయారు. ఇక సినిమాలో సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని దృశ్యాలన్నీ కెమెరామెన్ చాలా అందంగా చూపించారు.

ఇక సంగీతం విషయానికి వస్తే.. పాటలు పర్వాలేదనిపస్తాయి. కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ పర్వాలేదు. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ట్రీమ్ చేయాల్సింది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

సంజయ్ కార్తీక్ దర్శకత్వంలో విశ్వంత్, పల్లక్ లల్వాని జంటగా వచ్చిన ఈ ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్’ ఆసక్తికరంగా సాగలేదు. కాకపోతే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని లవ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. కానీ కథాకథనాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సాగవు. దీనికి తోడు సినిమా కూడా చాలా చోట్ల మరీ సినిమాటిక్ గా సాగుతుంది. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating :2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు