ఎన్టీఆర్ విలన్ గా మంచు హీరో?

Published on Jul 4, 2020 2:03 am IST

ఆర్ ఆర్ ఆర్ మూవీలో కొమరం భీమ్ గా చేస్తున్న ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ తో కమిటైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఐతే ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర వార్త పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా మంచు మనోజ్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విలన్ పాత్రకు చాల ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో మనోజ్ చక్కగా సరిపోతాడని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఆయన గత చిత్రం అల వైకుంఠపురంలో సుశాంత్ కి ఓ కీలక రోల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరి ఈ న్యూస్ లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. మనోజ్ ప్రస్తుతం ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా మనోజ్ కెరీర్‌లో భారీ బడ్జెట్ సినిమాగా రాబోతోంది. ఇక ఎన్ టీఆర్, త్రివిక్రమ్ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లు కలిసి నిర్మిస్తున్నాయి. థమన్ సంగీతం అందించనున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

సంబంధిత సమాచారం :

More