“ఆర్ఎక్స్ 100” సినిమాను వదిలేసుకున్న క్రేజీ హీరోలు !

“ఆర్ఎక్స్ 100” సినిమాను వదిలేసుకున్న క్రేజీ హీరోలు !

Published on Jul 16, 2018 3:44 PM IST

కార్తికేయ, పాయల్ రాజపుత్‌ హీరో హీరోయిన్లుగా, నూతన దర్శకుడు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన చిత్రం “ఆర్ఎక్స్ 100” చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువుగా ఉందని పేరు వచ్చినప్పటికీ ప్రేక్షకుల్లో మాత్రం ఈ సినిమాకి ఆదరణ పెరుగుతుంది. కాగా ఈ సినిమాతో కార్తికేయ హీరోగా ప‌రిచ‌యమై మంచి పేరు తెచ్చుకున్నాడు. తన నటనతో, డ్యాన్సులతో, నటుడిగా ప్రూవ్ చేసుకోవడమే కాక హీరోగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అయితే ఈ విజయవంతమైన సినిమాను ఇద్దరు యంగ్ హీరోలు చేజేతులారా మిస్ చేసుకున్నారు. ముందుగా ఈ చిత్ర దర్శకుడు అజ‌య్ భూప‌తి, విజయ్ దేవరకొండకి పెళ్లిచూపులు రిలీజ్ కి ముందే ఈ సినిమా కథ వినిపించాడట. కొన్ని కారణాల వల్ల విజయ్ దేవరకొండ ఈ చిత్రం చేయకలేకపోయాడు. అలాగే అజ‌య్‌భూప‌తి దాదాపు మూడు నెలల పాటు సుధీర్ బాబు కోసం తిరిగాడ‌ట‌. కానీ సుధీర్ బాబు ఈ సినిమా చేయటానికి ఆసక్తి చూపలేదు. దాంతో కార్తికేయ దగ్గరికి ఈ చిత్రకథ వెళ్ళింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు