ఏకంగా 11 సినిమాలలో నటిస్తున్న క్రేజీ హీరోయిన్

Published on Jul 19, 2019 7:00 am IST

చిత్ర పరిశ్రమలో రాణించాలంటే టాలెంట్ ఎంతున్నా, అదృష్టం అనేది కూడా ఉండాలి అంటారు.ఆలా అందం, అభినయం తోపాటు, అదృష్టం తో దూసుకుపోతున్నారు నటి ఐశ్వర్య రాజేష్. ఈమె అదృష్టానికి ఎవరైనా ఈర్ష్య పడాల్సిందే. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఏకంగా 11 సినిమాలున్నాయి.

నాలుగు తమిళ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండగా మరో నాలుగు చిత్రాలను రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఇవి కాకుండా తెలుగులో ‘మిస్ మ్యాచ్’.. తో పాటు ‘కౌసల్య కృష్ణ మూర్తి’.. విజయ్ దేవరకొండ చిత్రాలు కూడా ఉన్నాయి. అలాగే కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రానున్న భారీ చిత్రం భారతీయుడు 2 లో కూడా ఐశ్వర్య ఒక హీరోయిన్ గా ఎంపికయ్యారు.

ఇలా వరుస అవకాశాలు అందుకుంటు ఈ నటి పరిశ్రమలో దూసుకుపోతున్నారు.బుల్లితెర యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఐశ్వర్య 2010 లో వచ్చిన “నీతన అవన్” తమిళ చిత్రంతో చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. 2012 లో వచ్చిన “అత్తకత్తి” ఈమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

సంబంధిత సమాచారం :