మరోసారి ‘సైనికుడు’ మ్యూజిక్ డైరెక్టర్ తో మహేష్.!

మరోసారి ‘సైనికుడు’ మ్యూజిక్ డైరెక్టర్ తో మహేష్.!

Published on Oct 19, 2015 7:02 PM IST

Mahesh-babu-murugadoss
‘శ్రీమంతుడు’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి రానున్న తదుపరి సినిమా ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఇప్పటికే మొదలై రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. దాంతో ఈ సినిమా తర్వాత మహేష్ బాబు చేయనున్న క్రేజీ ప్రాజెక్ట్ ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ బాబు సౌత్ క్రేజీ డైరెక్టర్ ఎఆర్ మురుగదాస్ తో ఓ సినిమా చేయనున్నాడనే విషయాన్ని ఇదివరకే తెలియజేశాం. మురుగదాస్ ప్రస్తుతం ఫైనల్ స్క్రిప్ట్ ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

తాజాగా ఈ సినిమాకి సంబందించిన ఓ విషయం తెలిసింది. అదేమిటంటే.. సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హారీష్ జైరాజ్ మురుగదాస్ – మహేష్ బాబుల సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపిక చేసారట. హారీష్ గతంలో మహేష్ బాబుకి సైనికుడు సినిమాకి పనిచేయడమే కాకుండా ఆ సినిమాకి సూపర్ హిట్ ఆల్బమ్ ని ఇచ్చాడు. అలాగే మురుగదాస్ – హారీష్ జైరాజ్ కాంబినేషన్ లో సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. దాంతో మురుగదాస్ ఈ ప్రాజెక్ట్ కోసం హారీష్ జైరాజ్ ని ఫైనల్ చేసాడట. ఈ విషయంపై అధికారిక అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఠాగూర్ మధు – ఎన్.వి ప్రసాద్ లు కలిసి నిర్మించనున్న ఈ సినిమాని జనవరిలో అధికారికంగా లాంచ్ చేసే పనిలో ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు