అఖిల్ ‘లెనిన్’ నుంచి క్రేజీ న్యూస్ !

అఖిల్ ‘లెనిన్’ నుంచి క్రేజీ న్యూస్ !

Published on Jan 4, 2026 5:00 PM IST

Lenin

యువ హీరో అక్కినేని అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ తెలుస్తోంది. . ఈ సినిమాలో అఖిల్ పాత్రకి దృష్టి లోపం ఉంటుందని.. ఆ కారణంగా ఆ పాత్ర పడే ఇబ్బందులు.. హీరో పాత్ర చుట్టూ నడిచే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని.. ముఖ్యంగా ఈ పాయింట్ కి ఇంటర్వెల్ సీక్వెన్స్ ను చాలా బాగా కనెక్ట్ చేశారని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు