అంజలి పాత్ర పై క్రేజీ రూమర్

అంజలి పాత్ర పై క్రేజీ రూమర్

Published on Apr 22, 2024 8:00 PM IST

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ అంజలి కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ఐతే, అంజలి పాత్ర పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. గేమ్‌ చేంజర్ లో అంజలి కనిపించేది కొన్ని సన్నివేశాలు మాత్రమే. అది కూడా ఫ్లాష్ బ్యాక్ లో. ఐతే, అంజలి పాత్ర సినిమాలో కొద్ది సమయం మాత్రమే ఉన్నా.. చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.

పైగా మెయిన్‌ హీరోయిన్ కియారా పాత్రను డామినేట్‌ చేసే విధంగా అంజలి పాత్ర ఉంటుందని.. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో చరణ్ కు జోడీగా అంజలి చాలా బాగా నటించిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో చూడాలి. కాగా ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తన కెరీర్ లోనే బెస్ట్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి ఆస్కార్ వచ్చిన తర్వాత, రామ్ చరణ్ తేజ్ ఇమేజ్ గ్లోబల్ రేంజ్ కి వెళ్ళింది. అందుకే, శంకర్ కూడా చరణ్ సినిమాని ఆ రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు