ప్రభాస్ ‘ఫౌజీ’లో మరో స్టార్ హీరో ?

ప్రభాస్ ‘ఫౌజీ’లో మరో స్టార్ హీరో ?

Published on Mar 2, 2025 9:00 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫౌజీ. ఈ సినిమాను పీరియాడిక్ వార్ అండ్ లవ్ స్టోరీగా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. అయితే, ఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో ఈ పాత్ర సినిమాలోనే ముఖ్యమైన పాత్ర అని, కథకు అనుగుణంగా సన్నీ డియోల్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. కాగా హీరోయిన్ ఆలియా భట్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆమె యువరాణి పాత్రలో కనిపిస్తారని టాక్.

కాకపోతే ఈ వార్తల పై ఇంకా అధికారికంగా అప్ డేట్ రాలేదు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గా ఆయన ఫౌజీ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. అలాగే, ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే హను రాఘవపూడి సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు