క్రేజీ ప్లాన్: లక్ష మంది ఫ్యాన్స్ తో ‘ఉస్తాద్’ సాంగ్!

క్రేజీ ప్లాన్: లక్ష మంది ఫ్యాన్స్ తో ‘ఉస్తాద్’ సాంగ్!

Published on Dec 13, 2025 4:00 PM IST

Ustaad Bhagat Singh

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల అలాగే రాశిఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. మంచి బజ్ ని సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు గ్రాండ్ గా ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సాంగ్ ని ఆఫ్ లైన్ లో గ్రాండ్ ఈవెంట్ నడుమ రిలీజ్ చేస్తున్నారు. దీనికి వేదికని కూడా ఖరారు చేసుకున్నారు.

అయితే ఈ సాంగ్ కోసం మరో క్రేజీ ప్లాన్ ను ఫస్ట్ ఎవర్ గా మేకర్స్ తీసుకొచ్చారు. ఈ సాంగ్ తాలూకా లిరికల్ షీట్ ని లాంచ్ చేసే లక్కీ ఫ్యాన్స్ లిస్ట్ లో భాగం కావచ్చని చెబుతున్నారు. కొన్ని సింపుల్ ప్రశ్నలకి సమాధానం చెప్పి ఆ లక్కీ ఫ్యాన్స్ లో ఒకరిగా నిలవమంటున్నారు. ఇలా మొత్తానికి అయితే సాలిడ్ ప్రమోషన్స్ ని అటు ఆఫ్ లైన్ ఇటు ఆన్లైన్ లో కూడా మేకర్స్ స్టార్ట్ చేసారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు