
ఈ మధ్యకాలంలో కొంతమంది కొత్త డైరెక్టర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకొని దానికి సమపాళ్ళలో కమర్షియల్ హంగులని అద్ది సినిమాలు చేసి విజయాల్ని అందుకుంటున్నారు. అదే విధంగా టాలీవుడ్ కి ఓ డిఫరెంట్ జానర్ టచ్ ని పరిచయం చేస్తూ సుశాంత్ రెడ్డి చేసిన సినిమా ‘సూపర్ స్టార్ కిడ్నాప్’. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని ఓ ముగ్గురు యువకులు కిడ్నాప్ చెయ్యడం అనే ఇతివృత్తాన్ని బేస్ చేసుకొని చేసిన ఈ సినిమా జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చాలా కాలం వాయిదాపడి రిలీజ్ అవుతుండడంతో ఈ చిత్ర టీం అని చోట్లా జోరుగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. విజయవాడ, వైజాగ్ లాంటి ప్రదేశాల్లో ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలని డిజిటల్ లైటింగ్ హోర్డింగ్స్ తో సిటీలో ర్యాలీలు చేస్తున్నారు. ఈ చిత్ర టీం హైదరాబాద్ లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ మరియు పోస్టర్స్ లో సూపర్ స్టార్ పేరు పెట్టుకోవడం ఈ సినిమాకి బాగా హెల్ప్ అవుతోంది. ఆదర్శ్ బాలకృష్ణ, భూపాల్, నందు మరియు వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ దాస్ నెగటివ్ పాత్రలో కనిపించనుంది. చందు నిర్మించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

