సూర్య ‘మాస్’ సినిమాకు క్రేజీ ప్రమోషన్!

సూర్య ‘మాస్’ సినిమాకు క్రేజీ ప్రమోషన్!

Published on May 12, 2015 8:38 PM IST

Rakshasudu-First-Look
తమిళ సూపర్ స్టార్ సూర్య, తాజాగా ‘మాస్’ పేరుతో ఓ సరికొత్త కథాంశంతో మన ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌తో కలిసి సూర్య సొంతంగా నిర్మించడం విశేషం. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ వర్షన్ ఆడియోను మే 8నే విడుదల చేయగా తెలుగు ఆడియోను మే 18న విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్ల కోసం మాస్ టీమ్ సరికొత్త ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘రాక్షసుడు'(మాస్) టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక ఈ సినిమాకు ఇంతకుముందెన్నడూ చేపట్టని రీతిలో ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించే పనిలో సినిమా యూనిట్ ఉంది. ఈ సాయంత్రం మాస్ టీమ్ చెన్నైలో ఓ పెద్ద ప్రెస్‌మీట్‌ను ఏర్పాటు చేసింది. తెలుగులో కూడా ఈ సినిమాకు భారీ ప్రమోషన్‌ను కల్పించేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ కోసమే సూర్య తాజాగా నటిస్తోన్న 24 సినిమా షూటింగ్‌కు కొంత గ్యాప్ ఇచ్చాడు. నయనతార, ప్రణీత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను మే 29న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు