‘అఖండ 2’ రిలీజ్ పై క్రేజీ రూమర్!

‘అఖండ 2’ రిలీజ్ పై క్రేజీ రూమర్!

Published on Apr 19, 2025 2:59 PM IST

నందమూరి బార్న్ కింగ్ బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “డాకు మహారాజ్” తో తన కెరీర్లోనే భారీ హిట్ సినిమాని సొంతం చేసుకున్నారు. ఇక దీనిని కూడా డెఫినెట్ గా బ్రేక్ చేసే సినిమా ఏదన్నా ఉంది అంటే అది తాను నటిస్తున్న ప్రస్తుత చిత్రం “అఖండ 2” అని చెప్పవచ్చు. పాన్ ఇండియా లెవెల్లో అఖండ 2 పట్ల గట్టి హైప్ ఉంది.

పార్ట్ 1 థియేటర్స్ లో మన దగ్గర అదరగొడితే ఓటిటిలో వచ్చాక నార్త్ ఆడియెన్స్ క్రేజీ రెస్పాన్స్ అందించారు. మరి ఇదిలా ఉండగా ఇపుడు పార్ట్ 2 పై ఓ క్రేజీ టాక్ ఇపుడు వినిపిస్తుంది. దీంతో అఖండ 2 చిత్రం రిలీజ్ పై ఇపుడు టాక్ వినిపిస్తుంది. దీనిటి అఖండ 2 అనుకున్న సమయానికి రాకపోవచ్చట. మేకర్స్ సెప్టెంబర్ 25 కి ప్లాన్ చేశారు కానీ అఖండ 2 మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుంది అని తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఒక ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు