“పుష్ప”లో బన్నీ రెమ్యునరేషన్ పై క్రేజీ రూమర్..!

Published on Jul 1, 2020 8:07 pm IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు నార్త్ ఆడియన్స్ లో ఎలాంటి ఆదరణ ఉందో తెలిసిందే. అలా ఎప్పటి నుంచో బాలీవుడ్ లో బన్నీ అడుగు ఎప్పుడు పడుతుందా అనుకున్న నేపథ్యంలో తన ఆల్ టైం హిట్ మరియు హ్యాట్రిక్ దర్శకుడు సుకుమార్ తో మొట్టమొదటి సారి “పుష్ప” అనే భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ తో అందుకు దారి దొరికింది.

అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడొక క్రేజీ రూమర్ వినిపిస్తుంది. పాన్ ఇండియన్ సినిమా అంటే మినిమం బడ్జెట్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే బన్నీ ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకొనున్నారని పలు కథనాలు వినిపించాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా నిర్మాతలు బడ్జెట్ విషయంలో భారీ మార్పులు చేయాలని భావించారు.

అందులో భాగంగా బన్నీ తన 50 కోట్ల భారీ రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని తగ్గించుకున్నారని అది సినిమాకు మరింత ఉపయోగపడుతుందన్న భావనతో అలా చేసారని ఓ క్రేజీ రూమర్ ఊపందుకుంది. ఎలాగో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కాబట్టి రెమ్యూనరేషన్ లు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. ఈస్థాయిలో అనేది ఎవరూ ఊహించనటువంటిది. మరి ఈ అంశంపై అసలు క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :

More