త్రివిక్రమ్ నెక్స్ట్ మూవీ ఎన్టీఆర్ తో కాదట..!

Published on Feb 17, 2020 12:36 pm IST

త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో రూపంలో కెరీర్ బెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ ఆయనకు అల వైకుంఠపురంలో ఇచ్చింది. ఇక త్రివిక్రమ్ తన తదుపరి చిత్రం ఎన్టీఆర్ తో చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ ప్రముఖంగా వినిపిస్తుంది. అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో రానున్న టైటిల్ విషయంలో కూడా ఒక ఆసక్తిక వార్త ప్రచారంలో ఉంది.

కాగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ విడుదల 2021 జనవరి 08కి వాయిదాపడిన నేపథ్యంలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం దాదాపు ఏడాది ఎదురుచూడాలి. ఈ క్రమమంలో ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ నుండి బయటికి వచ్చే లోపు త్రివిక్రమ్ చిన్న హీరోతో ఓ మీడియం బడ్జెట్ మూవీ త్వరిత గతిన పూర్తి చేయాలని చూస్తున్నారట. కొద్దిరోజులలో ఈ ప్రాజెక్ట్ పై ప్రకటన వెలువడే అవకాశం కలదు అంటున్నారు. హీరోలతో సమానంగా ఇమేజ్ ఉన్న త్రివిక్రమ్ తన మేనియా తో ఎవరితో సినిమా చేసినా, దానిపై అంచనాలు పెరగడం ఖాయం.

సంబంధిత సమాచారం :

X
More