లేటెస్ట్..”వాల్తేరు వీరయ్య”లో అదిరిపోయే క్రేజీ సాంగ్.!

లేటెస్ట్..”వాల్తేరు వీరయ్య”లో అదిరిపోయే క్రేజీ సాంగ్.!

Published on Oct 28, 2022 7:00 PM IST


ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకొని ఎదురు చూస్తున్న అవైటెడ్ మాస్ మసాలా చిత్రం “వాల్తేరు వీరయ్య”. మెగాస్టార్ చిరంజీవి సహా మాస్ మహారాజ రవితేజ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ అయితే వింటేజ్ మెగాస్టార్ ట్రీట్ ని ఇచ్చేలా తీస్తున్నాడు. ఇక రీసెంట్ గా వచ్చిన టైటిల్ టీజర్ తో సినిమాపై అనేక అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రాన్ని ఇప్పుడు శరవేగంగా తెరకెక్కిస్తుండగా లేటెస్ట్ అప్డేట్ అయితే ఈ సినిమాపై వచ్చింది.

ఇప్పుడు మేకర్స్ ఓ సాలిడ్ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారట. మరి మెగాస్టార్ మరియు రవితేజ పై ఈ సాంగ్ ఉండగా ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ ని చేస్తున్నారట. మరి ఈ సాంగ్ అయితే అదిరిపోయే లెవెల్లో ట్రీట్ ని ఇస్తుంది అని సినీ వర్గాలు వారు అంటున్నారు. మరి దేవిశ్రీ ప్రసాద్ అయితే ఎలాంటి ట్యూన్ ని దీనికి కంపోజ్ చేస్తాడో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించగా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు