క్రేజీ టాక్ : “బిగ్ బాస్ 7” టైటిల్ విన్నర్ గా అతడే..?

క్రేజీ టాక్ : “బిగ్ బాస్ 7” టైటిల్ విన్నర్ గా అతడే..?

Published on Dec 17, 2023 11:00 AM IST

మన తెలుగు స్మాల్ స్క్రీన్ మీద బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ షో కోసం అందరికీ తెలిసిందే. స్టార్ మా ఛానెల్లో ప్రసారం అయ్యే ఈ సెన్సేషనల్ రియాలిటీ షో ఇప్పటివరకు తెలుగులో మొత్తం 6 సీజన్ లను కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు 7వ సీజన్ కూడా నేటితో ముగియనుంది. ఇక ఈ అవైటెడ్ ఫైనల్ ఎపిసోడ్ అయితే గత రెండు సీజన్ల కంటే ఎక్కువ హైప్ లో కూడా ఉంది.

అయితే ఈ సీజన్లో ఎవరు విన్ అవుతారు అనేది అందరిలో ఆసక్తిగా ఉంది. మరి ఈ ఫైనల్ లిస్ట్ లో అయితే టాప్ 3 లో శివాజీ, అమర్ దీప్ వీరితో పాటుగా పల్లవి ప్రశాంత్ లు రేస్ లో ఉండగా వీరిలో ఫైనల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలిచినట్టుగా స్ట్రాంగ్ రూమర్స్ వినిపిస్తున్నాయి. అమర్ దీప్ మరియు పల్లవి ప్రశాంత్ లు టాప్ గా నిలవగా వారిలో బిగ్ బాస్ 7 టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలిచాడని తెలుస్తుంది. మరి విన్నర్ ఎవరో తెలియాలి అంటే ఇవాళ రాత్రి వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు