ఎన్టీఆర్.. ‘అయినను పోయి రావలె హస్తినకు..’ !

Published on Jan 28, 2020 3:52 pm IST

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయితే త్రివిక్రమ్ తో తన తర్వాతి చిత్రాన్ని చేయాలనుకుంటున్న ఎన్టీఆర్ తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా పకడ్బంధీగా ప్లాన్ చేస్తున్నారట. . ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి గాసిప్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, త్రివిక్రమ్ ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు…’ అని టైటిల్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి ఈ టైటిలే వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంది. అయితే ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని బన్నీతో తీసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాకి అనుకున్న టైటిల్స్ లో ‘అయినను పోయి రావలె హస్తినకు…’ అనే టైటిల్ కూడా ఒకటని.. ఒకవేళ ఈ టైటిల్ పెట్టి ఉంటే సినిమాలో ఇంటి పేరు ‘వైకుంఠపురము’ కాకుండా ‘హస్తిన’ అని పెట్టేవారట. ఇక గతంలో త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘అరవిందసమేత’ లాంటి సూపర్ హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :

X
More