ఆకట్టుకుంటున్న “అనుకున్నది ఒక్కటీ అయ్యింది ఒక్కటీ” లిరికల్ సాంగ్

Published on Aug 16, 2021 7:26 pm IST

కిరణ్ కే తలశిల సమర్పణ లో గుడ్ సినిమా గ్రూప్ పతాకం పై గుడ్ ఫ్రెండ్స్ మరియు బొడ్డు అశోక్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం క్రేజీ అంకుల్స్. శ్రీ ముఖి, రాజా రవీంద్ర, మనో, భరణి, పోసాని కృష్ణమురళి, గిరిధర్, అదుర్స్ రఘు, హేమ, గాయత్రి భార్గవి, విజయ మూర్తి, వాజ్పాపాయ్, మహేంద్ర నాథ్, మాధురి, సింధురి లు నటిస్తున్న ఈ క్రేజీ అంకుల్స్ చిత్రానికి ఈ సత్తి బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుండి తాజాగా అనుకున్నది ఒక్కటీ అయ్యింది ఒక్కటీ అనే లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం నుండి విడుదల అయిన ఈ పాట ఆసక్తికరం గా ఉండటం తో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 19 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :