‘జై లవ కుశ’ ను లీక్ చేసిన వ్యక్తుల అరెస్ట్ !


యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘జై లవ కుశ ‘ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే నిన్న ఉన్నట్టుండి ఈ సినిమా టీజర్లోని కొన్ని విజువల్స్ లీకై ఇంటర్నెట్లో దర్శనమిచ్చాయి. విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఈ విజువల్స్ ఎన్టీఆర్ పాత్ర తాలూకు స్వభావాన్ని బయటపెట్టేవిగా ఉన్నాయి. దీంతో యూనిట్ సభ్యులతో పాటు, అభిమానులు కూడా షాక్ కు గురయ్యారు.

దీనిపై వెంటనే స్పందించిన తారక్ టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడమేగాక సోషల్ మీడియాలో లీకైన విజువల్స్ ను షేర్ చెయ్యొద్దని నెటిజన్లకు విజ్ఞప్తి కూడా చేసింది. పిర్యాదు అందుకున్న పోలీసులు కొద్ది సమయంలోనే విజువల్స్ బయటికి రావడానికి కారణమైన వారిని అరెస్ట్ చేసింది. అయితే ఆ వ్యక్తులు ఎవరు, లీకేజికి ఎందుకు పాల్పడ్డారు అనే వివరాలు మాత్రం ఇంకా గోప్యంగానే ఉన్నాయి.