చుల్ బుల్ పాండే సునామి శాంపిల్ చూపిస్తారట.

Published on Oct 23, 2019 10:43 am IST

పోలీస్ గా చుల్ బుల్ పాండే సాహసాలు శాంపిల్ చూడడానికి సిద్ధంకండి. ఎందుకంటే సల్మాన్ నటించిన దబాంగ్ 3 మూవీ తెలుగు ట్రైలర్ నేడు విడుదల కానుంది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పివిఆర్ సినిమాస్ వేదికగా సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అభిమానులతో సల్మాన్ ఖాన్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. దబాంగ్ సిరీస్ లో మూడవ చిత్రంగా వస్తున్న దబాంగ్ 3 తెలుగులో కూడా విడుదల అవుతుంది.

దబాంగ్ 3 చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు హీరో ప్రభుదేవా దర్శకత్వం వహించడం విశేషం. గతంలో సల్మాన్ హీరోగా తెరకెక్కిన వాంటెడ్ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించడం జరిగింది. తెలుగు పోకిరి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం సల్మాన్ ఖాన్ ని పరాజయాల నుండి బయటపడేసింది. గత రెండు పార్ట్ లలో హీరోయిన్ గా చేసిన సోనాక్షి సిన్హా ఈ మూవీలో కూడా హీరోయిన్ గా నటించడం విశేషం. ఇక ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More