సెప్టెంబర్ 20న దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ !

Published on Aug 28, 2019 12:00 am IST

భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019కి తెరలేచింది. దాదాసాహెబ్ 150వ బర్త్ యానివర్శరీని పురస్కరించుకొని ఈ అవార్డ్స్ వేడుకను అంగరంగ వైభవంగా చేయనున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖుల్ని ఈ సందర్భంగా సత్కరించనున్నారు. ఈ అద్భుతమైన వేడుకకు హైదరాబాద్ లోని మాదాపూర్, ఎన్ కన్వెన్షన్ వేదిక కానుంది. సెప్టెంబర్ 20న ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భంగా ఈవెంట్ ఇన్విటేషన్ ను, అవార్డ్ ట్రోఫీని సీ స్పేస్ లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సీఈవో అభిషేక్ మిశ్రా, సంస్థ ప్రతినిధులు వినయ్, యశ్… ఎంటర్ ప్రెన్యూర్ శ్రీధర్ రావ్, సీ స్పేస్ ప్రతినిథులు రాకేష్, పవన్ మరియు మిస్ ఇండియా 2013, సిమ్రన్ అహూజా పాల్గొన్నారు.

ఇటీవలే బాలీవుడ్ లో ఈ అవార్డుల పండగ అద్భుతంగా జరిగింది. దీంతో హైదరాబాద్ లో జరగబోయే ప్రెస్టీజియస్ దాదాసాహెబ్ సౌత్ అవార్డ్స్ వేడుక కోసం సినీలోకం ఎదురుచూస్తోంది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో టాప్ సినీ సెలెబ్రిటీస్, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు, ప్రత్యేక అతిథులు పాల్గొంటున్నారు. దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందిస్తున్న వారిని ప్రత్యేకంగా సన్మానించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్ గా జరుగుతున్నాయి.

సంబంధిత సమాచారం :

More