నెక్స్ట్ మూవీ టైటిల్, గ్లింప్స్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మ్యాచో స్టార్..!

నెక్స్ట్ మూవీ టైటిల్, గ్లింప్స్‌పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన మ్యాచో స్టార్..!

Published on Jun 11, 2026 6:00 PM IST

మ్యాచో స్టార్ గోపీచంద్ తన అభిమానులకు క్రేజీ అప్‌డేట్ ఇచ్చాడు. ఆయన నటిస్తున్న 34వ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ గ్లింప్స్‌ను రేపు(జూన్ 12) సాయంత్రం 5:45 గంటలకు అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

ఈ గ్లింప్స్‌తో గోపీచంద్ తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. యాక్షన్ మాస్టర్ వెంకట్ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇక ఈ అప్డే్ట్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచింది.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను 70ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి రేపు రాబోయే గ్లింప్స్ ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో వేచి చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు