విజయ్ దేవరకొండ మాస్ రివీల్ కి డేట్, టైం వచ్చేశాయ్!

విజయ్ దేవరకొండ మాస్ రివీల్ కి డేట్, టైం వచ్చేశాయ్!

Published on Dec 18, 2025 5:00 PM IST

విజయ్ దేవరకొండ

మన టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఇప్పుడు చేస్తున్న ఓ సినిమా కోసం మాత్రం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. దీనికి ముందు కింగ్డమ్ లాంటి సినిమా ఉన్నప్పటికీ దర్శకుడు రవికిరణ్ కోలా క్రియేట్ చేసిన మాస్ మ్యాజిక్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తిగా విజయ్ దేవరకొండ నుంచి ఒక ఊహించని మాస్ షేడ్ ని ఇందులో ప్రెజెంట్ చేస్తుండగా ఈ సినిమా తాలూకా టైటిల్ రివీల్ ని అతి త్వరలోనే చేస్తారని పలు రూమర్స్ అయితే వచ్చాయి.

మరి ఫైనల్ గా అందుకు సమయం వచ్చేసింది. దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ ఇంట్రో వీడియోతో మేకర్స్ టైటిల్ గ్లింప్స్ ని ఈ డిసెంబర్ 22న సాయంత్రం 7 గంటల 29 నిమిషాలకి రివీల్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. దీనితో ఫ్యాన్స్ ఆ రోజు కోసం ఇప్పుడు నుంచి ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు