టాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రాల్లో దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర’. తమిళ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అయితే, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను వేగవంతం చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇందులో భాగంగా ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలో ఈ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్‌ను చెన్నైలోని శ్రీ సాయిరామ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో జూన్ 1న గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.
ఈ ఆడియో లాంచ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టులుగా ఎవరు వస్తున్నారా అనే అంశంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Chennai… ready aa? Vera maari kuthu night waiting! ????
Come witness the blockbuster audio launch of #Kuberaa in all its glory!
???? June 1st
???? Leo Muthu Indoor Stadium, Sri Sai Ram Institute of TechnologyIn cinemas June 20, 2025.#Kuberaa #SekharKammulasKuberaa… pic.twitter.com/omxWvoFuae
— Aditya Music (@adityamusic) May 28, 2025


