పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మొత్తం ముగ్గురు హీరోయిన్స్ రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ అలాగే నిధి అగర్వాల్ లతో దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న సాలిడ్ హారర్ ఎంటర్టైనర్ చిత్రమే ది రాజా సాబ్. అభిమానుల్లో మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఒకో కంటెంట్ తో వింటేజ్ ప్రభాస్ ని చూపిస్తుంది. ఇక ఈ సినిమాకి సంబంధించి మేకర్స్ ఒక ఉహించని సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చేసారు.
సినిమా రిలీజ్ కి వారమో ఐదారు రోజులు ఉండగా పెట్టుకోకుండా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని రేపే డిసెంబర్ 27న గ్రాండ్ గా చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసేసారు. ఇక ఈ ఈవెంట్ ని హైదరాబాద్ లోనే చేస్తున్నట్టుగా ప్లేస్ ని ఫిక్స్ చేయగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ హంగామా మొదలు కానున్నట్టు తెలిపారు. మరి ఈ ఈవెంట్ పై మరిన్ని డీటెయిల్స్ రేపటికి ఒకొకటి రానున్నాయి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది జనవరి 9న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా ఈ సినిమా రాబోతుంది.
See you all tomorrow at the Pre Release Event ❤️????
Stay tuned for more details….#Prabhas #TheRajaSaab pic.twitter.com/wvaCFK4DXv
— The RajaSaab (@rajasaabmovie) December 26, 2025


