మణిరత్నం సినిమా ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Published on Nov 11, 2019 2:01 pm IST

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. చాలా రోజుల నుండి ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ప్రారంభానికి సిద్దమైంది. డిసెంబర్ 12వ తేదీన థాయిలాండ్ లో ఈ చిత్రం మొదలుకానుంది.
తమిళ పరిశ్రమలో రూపొందనున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున అంచనాలున్నాయి.

చారిత్రక నేపథ్యం కలిగిన ఈ చిత్రాన్ని ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా రూపొందనుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ అందిస్తుండగా కళా దర్శకుడిగా తోట తరణి వ్యవహరించనున్నారు. ఈ సినిమాలో జయం రవి, విక్రమ్, ఐశ్వర్యరాయ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, అమలాపాల్, కార్తి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు లాంటి స్టార్లు నటించనున్నారు.

సంబంధిత సమాచారం :

More