తెలంగాణాలో థియేటర్స్ తెరిచివేతకు డేట్ ఖరారు.!

Published on Jul 21, 2021 2:57 pm IST

కరోనా ప్యాండమిక్ మూలాన గత ఏడాది నుంచి థియేటర్స్ మూత పడి ఉన్న సంగతి తెలిసిందే. మధ్యలో నాలుగు నెలలు మాత్రమే తెరిచే అవకాశం ఏర్పడింది. ఇక మళ్ళీ కరోనా విజృంభించడంతో మన తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఇప్పటి వరకు కూడా మూత పడే ఉన్నాయి. దీనితో సినిమాల విడుదలకు ఆగిపోయి ఓటిటి విడుదలలు కూడా ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ పరిస్థితులు కాస్త సర్దుమణుగుతున్నాయి.

దీనితో తెలంగాణాలో థియేటర్స్ తెరిచివేతపై గత కొన్ని రోజులు నుంచి పలు వార్తలు వినిపిస్తుండగా ఇపుడు ఎట్టకేలకు ఒక డేట్ ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి తాజా అప్డేట్ ప్రకారం తెలంగాణాలో ఈ నెల 30 నుంచి థియేటర్స్ తెరిచివేతకు అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే చాలా చిత్రాలు ఆల్రెడీ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అలాగే ఇదే 30 వ తారీఖున కూడా పలు ఆసక్తికర సినిమాలు లాక్ అయ్యాయి. మరి ఏపీలో పరిస్థితి ఏంటి అన్నది తెలియల్సి ఉంది.

సంబంధిత సమాచారం :