పుట్టినరోజునాడే సినిమాని రిలీజ్ చేస్తున్న వర్మ !
Published on Feb 9, 2017 12:14 am IST


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘సర్కార్ 3’. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంపై బాలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. వర్మను బాలీవుడ్ ప్రపంచంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టింది కూడా సర్కార్ మొదటి భాగమే. అందుకే ఈ మూడవ పార్ట్ తో వర్మ మళ్ళీ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా అప్పుడే సినిమా విడుదల తేదీని ప్రకటించాడు వర్మ. ఆ విడుదల ఏప్రిల్ 7న వర్మ పుట్టినరోజు నాడే కావడం విశేషం. ఇకపోతే ఈ చిత్రంలో అమితాబ్ తో పాటు జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్పాయ్, యామీ గౌతమ్ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 
Like us on Facebook