యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రూరల్ మాస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసింది.
తాజాగా ఈ సినిమా నుంచి మరో సాలిడ్ అప్డేట్ మేకర్స్ ఇచ్చారు. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్‌గా ‘యెట్టా యెట్టా’ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ వీడియో సాంగ్‌ను ఏప్రిల్ 16న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ పాట పూర్తి మాస్ బీట్తో ప్రేక్షకులను అలరించడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.
ఈ సినిమాలో అఖిల్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఈ సినిమాను జూన్ 26న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.



