వార్ వన్ సైడ్ చేస్తున్న ‘వార్ 2’.. రెండో పీక్ బుకింగ్స్ తో బ్లాస్ట్

వార్ వన్ సైడ్ చేస్తున్న ‘వార్ 2’.. రెండో పీక్ బుకింగ్స్ తో బ్లాస్ట్

Published on Aug 16, 2025 12:06 AM IST

WAR2 poll

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ల కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన భారీ యాక్షన్ మల్టీస్టారర్ చిత్రమే “వార్ 2”. భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ స్పై యాక్షన్ చిత్రం మొదటి రోజు ఒకింత మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అంతెందుకు దీనితో పోటీకి ఉన్న కూలీ సినిమాకి కొద్దిగా ఎక్కువ బుకింగ్స్ కూడా కనిపించాయి. కానీ సీన్ కట్ చేస్తే రెండో రోజు మాత్రం వార్ 2 వార్ ని వన్ సైడ్ చేసేసినట్టు అనిపిస్తుంది.

ముఖ్యంగా ఉన్న అన్ని ముఖ్య సినిమాల్లో కూడా అలాంటి టాక్ తోనే బుకింగ్స్ పరంగా వార్ 2 పీక్ హవర్స్ లో ఒక్క గంటలో 56 వేలు నుంచి 60 వేల టికెట్స్ వరకు వెళుతుంది. కానీ ఇదే మార్క్ మిగతా సినిమాలకి కనిపించడం లేదు. దీనితో రెండో రోజు మాత్రం వార్ 2 కి బ్లాస్టింగ్ నంబర్స్ నమోదు అయ్యేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించగా యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు