నైజాంలో సాలిడ్ బిజినెస్ చేసిన డియర్ కామ్రేడ్ !

Published on Mar 23, 2019 12:00 am IST

అర్జున్ రెడ్డి , గీత గోవిందం సినిమాలతో బ్లాక్ బ్లాస్టర్ విజయాలను అందుకొని వరుస సినిమాలకు కమిట్ అవుతున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు విజయ్. ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క నైజాం థియేట్రీకల్ హక్కులను ఏషియన్ సినిమాస్ 7.6 కోట్లకు సొంతం చేసుకుందని టాక్.

భరత్ కమ్మ డైరెక్ట్ చేస్తున్న ఈచిత్రంలో విజయ్ కు జోడిగా రష్మిక నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 31న తెలుగు తోపాటు మలయాళ , తమిళ , కన్నడ భాషల్లో కూడా విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :

More