“డియర్ కామ్రేడ్” వారాంతానికి నైజాంలో ఎంత కొట్టాడంటే?

Published on Jul 29, 2019 9:56 am IST

“డియర్ కామ్రేడ్” మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద స్థిరమైన కలెక్షన్స్ సాధిస్తూ ముందుకెళుతుంది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని మంచి విజయం వైపుగా దూసుకుపోతుంది . ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ చిత్ర కలెక్షన్స్ ఆశాజనకంగా ఉన్నాయి.

మొదటి రోజు నైజాంలో 2.73 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం వారాంతం ముగిసేనాటికి 5.68 కోట్ల షేర్ సాధించింది. ఒక్క ఆదివారమే ఈ మూవీ 1.39 కోట్ల నిజాం షేర్ పొందింది. ఈ సోమవారం కూడా బోనాల పండుగ సందర్భంగా పాక్షికమైన సెలవుదినం రావడం ఈ మూవీకి అనుకూలించే అంశం. ఐతే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించడానికి ఇంకొంత మెరుగైన వసూళ్లు సాధించాల్సివుంది.

విజయ్ దేవరకొండ,రష్మిక మందాన జంటగా దర్శకుడు భరత్ కమ్మ తెరక్కెక్కించిన ‘డియర్ కామ్రేడ్’ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. ఈ చిత్రాన్ని సౌత్ ఇండియాలోని నాలుగు ప్రధాన భాషలైన తెలుగు,కన్నడ,మలయాళ,తమిళ భాషలలో విడుదల చేశారు. త్వరలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ హిందీలో రీమేక్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :