డియర్ కామ్రేడ్ విడుదల తేదీ ఖరారు !

Published on Mar 17, 2019 11:02 am IST

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , కన్నడ బ్యూటీ రష్మిక మండన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఈ సినిమా యొక్క టీజర్ మరి కొద్దీ సేపట్లో విడుదలకానుంది. ఇక ఈ చిత్రం యొక్క విడుదల తేదీ ఖరారైయింది. నూతన దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మే 31న తెలుగు తోపాటు మలయాళ , తమిళ , కన్నడ భాషల్లో విడుదలకానుంది.

ఎమోషనల్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ స్టూడెంట్ లీడర్ గా నటిస్తుండగా లిల్లీ పాత్రలో రష్మిక క్రికెటర్ గా కనిపించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :

More